ప్రతిభ చాటు
నిద్రనిమ్మంటున్న కళ్ళు, చివరి దశలో ఉన్న అని చెప్పెను భుజాల్లో బలం,
రోజు మోసుకొని వెళ్లినట్టు, ట్రోలీబైక్ పై బస్తలను మోసుకువెళ్తున్న కానీ ఈరోజు మాత్రం,
నీ వెన్నంటే వున్న అని భుజం తట్టి ,చెప్పినట్టు వుంది ఒక బస్త ఎక్కువవడంతో ,
ఈ రోజు అయిన నా గమ్యాన్ని చేరేనా ? లేదా ? అని సందేశంతో,
ఎదురుగా కనిపించే దుకాణంలోకి పరుగుతీసా,
అక్కడ వుండే న్యూస్పేపర్ కోసం.
వెన్నంటే నెట్టుకొచ్చిన ట్రోలిబండిని అక్కడే వదిలేసా,
నేనక్షణం అప్పుడే ఒక బస్తా జారిపోయినదని గమణించలేకపోయా…!
దూరం నుంచి నా ప్రతి కదలికను గమనిస్తున్నారు మా యజమాని
అతని చేతిలోనే ఆ న్యూస్పేపర్ ఉంది.
నేలమీద పడివున్న బస్తా అతని దృష్టిని ఆకర్షించింది
క్షణాల్లో, అతని ముఖం ఎర్రబారింది
కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రంలా అతని ముఖం మారిపోయింది.
సార్ ఒక్కసారి పేపర్ ఇవ్వండి చదువుకొని ఇచ్చేస్తాను “అని బతిమాలినా “.
పని మానేసి పేపర్ చదువుకుంటావా ? పోయి పని చేసుకో! అని విసుక్కున్నాడు యజమాని
సార్, ఒక్కసారి చూసి ఇచ్చేస్తాను అని మళ్ళీ అడిగినా
చెప్పింది అర్థం కాదా ? అని నా భుజం పట్టుకొని వెనక్కి తోసాడు
అలసిపోయి ఉన్న కదా , నేను కింద పడిపోయాను.
నా పెదవుల పై చిరునవ్వు చెరగలేదు కానీ,
నా కన్నుల్లో జ్వలించే నీరు ఆగనంటుంది.
నేను వెనుతిరిగి ఆ పడిన బస్తను సద్దుకొనిపోతున్న కానీ,
మనస్సులో ఎవో ఆలోచనలు, సమాధానం లేని చాల ప్రశ్నలను నా మది నన్ను అడుగుతుంది.
అప్పుడు వచ్చింది ఒక పిలుపు
(“దాహం కోసం ఎదురు చూస్తున్న పంటలకు వస్తున్న అని ఉరుములు, సంకేతం ఇచ్చినట్టుగా ఉంది ఆ పిలుపు”)
“ఆగు!,” యజమాని గొంతులో ఆజ్ఞాపించినట్టుగా పిలుపు వినిపించింది .
నా దగ్గరకు పరుగున వస్తూ, “బాబు” అని సంబోధించారు.
నా మనసులో మళ్ళీ మొదలుపెట్టింది ఆ ప్రశ్నల వర్షాన్ని,
“బాబు , నీ ఫోటో పేపర్లో వచ్చింది ,”అని ఆయన ఆశ్చర్యంగా అన్నారు. “నువ్వు 22 ఏళ్లకే కలెక్టర్ అయ్యావని రాశారు !”,
ఆ క్షణం నా మది చెప్పెను మర్చిపో నీ కష్టాన్ని.
విన్నక్షణం ఆనందంతో నెలకూలిపొయా! పైకి లెవండి బాబు అని చెయ్యి ఇచ్చి లేవమని చెప్పారు
నా కన్నుల్లో జ్వలించే నీరు ఇప్పుడు బయటకి వస్తుంది భాదతో కాదు ! ఆనందంతో…!
నన్ను వెనక్కి నెట్టిన్న చెయ్యి ఇప్పుడు అదే చెయ్యి పైకి లేవమని చెప్తోంది
ఈ సమయంలో చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి
ఆ రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక
“అమ్మా….” ఊరిలో కొంత మంది నన్ను ఎందుకు పనికి రావని అంటున్నారు”.
నా గుండె బరువెక్కింది. ఆ మాటలు నా చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి.
అమ్మ నా దగ్గరకి వచ్చి నా జుట్టు సవరిస్తూ శాంతంగా ఉంది.
అమ్మ స్పర్శ నా ఒత్తిడిని కొంచెం తగ్గించింది.
అప్పుడు ఇలా అంది ” నాన్నా వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు,
ఈ రోజు నీది కాదు అని ముందుకు వెళ్ళు”.
అమ్మ కళ్ళు నా కళ్ళను సూటిగా చూస్తున్నాయి ,ఆమె నమ్మకం నాలో కాస్త ధైర్యాన్ని నింపుతోంది.
” కానీ అమ్మ….” ప్రతి రోజు ఇలా అనుకుంటే నా రోజు ఎప్పుడు వస్తుందమ్మా…?
అమ్మ నా ముఖన్ని తన చేతుల్లోకి తీసుకుంది . నా కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది.
” నాన్నా నువ్వు బాగా చదువుకుంటే నీ చదువే నీకు గౌరవాన్ని తెస్తుంది. ఈ రోజు నిన్ను రేయ్ ,ఏంట్రా అని పిలిచేవాళ్లే రేపు బాబు,సార్ అని పిలుస్తారు. చదువు ఒక సూపర్ పవర్ నాన్నా ,నీకు గౌరవం కావలి అంటే నువ్వు చదువుకొని సంపాదించుకోవాలి”.
అమ్మ మాటల్లో నిజాయితీ ఉంది. ఆ మాటలతో నాలో ఒక కొత్త ఆశ చిగురించింది
వాస్తవం :
కొద్ది క్షణాల క్రితం ” రా ” అని చులకనగా పిలిచిన మనిషి ,
ఇప్పుడు” బాబు” అని గౌరవంగా సంబోధిస్తున్నారు .
“ఆ క్షణంలో, అమ్మ చెప్పిన మాటలు నిజమయ్యాయి.చదువు ఒక శక్తివంతమైన ఆయుధం అని నిరూపితమైంది. విద్య గౌరవాన్ని సంపాదించే అవకాశాన్ని ఇస్తుందని సృష్టంగా తెలిసింది ఆ గౌరవం నా కష్టానికి ప్రతిఫలంగా , నా విజయన్ని చాటుతోంది”.
~ Ram Kumar Chinthalapudi
What a unique one it is simply telling that the education can do anything and gives anything 👏🏻
Excellent story
Education is the power which gives respect.
Super 👌👏